బెంగళూరు టెస్టు.. కివీస్ 402 ఆలౌట్.. నిలకడగా ఆడుతున్న భారత్!
- చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్, భారత్ తొలి టెస్టు
- శతకం (134)తో రాణించిన రచిన్ రవీంద్ర
- కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు
- తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా
- కివీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల భారీ ఆధిక్యం
అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో కివీస్ కు తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. 18 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు ఒక వికెట్ కోల్పోయి 72 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 35 రన్స్ చేసి ఔటయ్యాడు. రోహిత్ శర్మ (36), విరాట్ కోహ్లీ (0) క్రీజులో ఉన్నారు.