ఈ నెల 23న సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం
- సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ
- హాజరు కానున్న మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు
- కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చ
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత, రెవెన్యూ చట్టం, మూసీ బాధితులకు న్యాయం చేసే అంశం, వరద నష్టం, రైతు భరోసాపై చర్చించే అవకాశముంది. అన్ని వివరాలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు అందాయి.
అటు, ఈ నెలాఖరున అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.