మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై మళ్లీ స్పందించిన సమంత

Actress Samantha Once Again Responded On Konda Surekha Comments
తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనను ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ నటి సమంత మరోమారు స్పందించారు. తన చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్లే సమస్యలను ఎదుర్కోగలిగానని చెప్పారు. తన తాజా వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్ని’ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత పలు విషయాలను పంచుకున్నారు. 

ఈ సందర్భంగా ఓ విలేకరి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సమంత.. ఈ రోజు తానిక్కడ కూర్చునేందుకు ఎంతోమంది మద్దతు ఉందని చెప్పారు. ఇండస్ట్రీలోని ప్రముఖుల ప్రేమ, తనపై వారికున్న నమ్మకమే తనను ఈ స్థాయిలో నిలబెట్టాయని పేర్కొన్నారు. వారు తన వైపు నిలబడకుంటే కష్టాలను ఎదుర్కొనేందుకు తనకు మరింత సమయం పట్టేదని చెప్పారు. ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై మాట్లాడుతూ.. ద్వేషపూరిత సందేశాలు వచ్చినప్పుడు వాటి ప్రభావం తనపై పడకుండా చూసుకుంటానని వివరించారు.

సిటాడెల్ సిరీస్ కోసం దర్శకులు తనను సంప్రదించినప్పుడు తాను చేయలేనని చెప్పానని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, తనను అనుకున్న పాత్రకు సరిపోయే నలుగురు హీరోయిన్ల పేర్లను కూడా రాజ్ అండ్ డీకేకు సిఫార్సు చేసినట్టు తెలిపారు. తాను చేయలేనని చెబుతున్నప్పటికీ వినకుండా పట్టుబట్టి మరీ తనతో ఆ పాత్రను చేయించారని పేర్కొన్నారు. తాను వద్దన్నా మరొకరిని తీసుకోకుండా తనతోనే ఆ పాత్ర చేయించడం తన అదృష్టమని సమంత చెప్పుకొచ్చారు. ఈ సిరీస్‌లో ఆమె స్పై ఏజెంట్‌గా నటించారు. సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ వచ్చే నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Go Back to Shorts
Samantha
Konda Surekha
Citadel: Honey Bunny

More Telugu News