గుంటూరు జిల్లాలో కుంగిన రైల్వే ట్రాక్... తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్‌కు అంతరాయం
- భారీ వర్షాలతో మాచవరం వద్ద కుంగిన రైల్వే ట్రాక్
- రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు
- తిరుపతి-సికింద్రాబాద్ రైలును వెనక్కి మళ్లించిన అధికారులు
- ఆ తర్వాత మూడో లైన్ ద్వారా సికింద్రాబాద్‌కు బయలుదేరిన వందేభారత్
తిరుపతి-సికింద్రాబాద్ రైలును అధికారులు వెనక్కి మళ్లించి అప్పికట్ల రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. ఆ తర్వాత అప్పికట్ల స్టేషన్ నుంచి మూడో లైన్ ద్వారా వందేభారత్ సికింద్రాబాద్‌కు బయలుదేరింది. విజయవాడ-చెన్నై మార్గంలోనూ పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.