గాయపడిన 17 మందిని పట్టుకుని చంపేశారు: మావోయిస్టు పార్టీ
- ఈ నెల 4వ తేదీన భారీ ఎన్ కౌంటర్
- ఎన్ కౌంటర్ లో 31 మంది మావోలు హతం
- గాయపడిన వారిని మరుసటి రోజు చంపేశారన్న మావోయిస్టు పార్టీ
తూర్పు బస్తర్ డివిజన్ కమిటీని అంతం చేయడానికి ఫాసిస్ట్ పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ మేరకు తూర్పు బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో లేఖను విడుదల చేసింది. అమరవీరుల ఆశయాలను స్మరించుకుంటూ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకువెళతామని తెలిపింది.
ఆరోజు జరిగిన ఎన్ కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో 13 మంది మహిళలు ఉన్నారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో ఒక ఐఎంజీ మెషిన్ గన్, 4 ఏకే47 గన్స్, ఇతర తుపాకులు, బుల్లెట్లు, పేలుడు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో తెలంగాణకు చెందిన వారు లేరని బస్తర్ ఐజీ సుందర్ రాజన్ వెల్లడించారు.