డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయండి: క్యాట్‌ను ఆశ్రయించిన నలుగురు అధికారులు

Amrapali files petition in CAT
  • ఇప్పుడు పనిచేస్తున్న చోటే పనిచేస్తామంటున్న నలుగురు అధికారులు
  • తెలంగాణ నుంచి ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్
  • ఏపీలోనే కొనసాగేలా చూడాలని క్యాట్‌ను ఆశ్రయించిన సృజన
తనను తెలంగాణలోనే కొనసాగించాలని, డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ ఆమ్రపాలితో పాటు మరో ముగ్గురు అధికారులు  కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ఏపీలో పనిచేస్తున్న సృజన క్యాట్‌ను ఆశ్రయించారు.

డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ వారు పిటిషన్ దాఖలు చేశారు. తమను తెలంగాణలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేయాలని  ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ఏపీలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సృజన వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

వారి పిటిషన్లపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ మంగళవారం నాడు విచారణ చేపట్టనుంది. ఏపీకి కేటాయించినా తెలంగాణలో కొనసాగుతున్న వారిలో ఐఏఎస్ అధికారులు వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్ ఆమ్రపాలి, ప్రశాంతి, ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి ఉన్నారు. తెలంగాణకు కేటాయించినా ఏపీలో కొనసాగుతున్న వారిలో ఐఏఎస్ అధికారులు సృజన, శివశంకర్, హరికిరణ్ ఉన్నారు.
Go Back to Shorts
Amrapali
CAT
Telangana
Andhra Pradesh

More Telugu News