కంకిపాడులో 'పల్లె పండుగ'... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న పవన్
- గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పల్లెపండుగ కార్యక్రమం
- పవన్ చేతుల మీదుగా కంకిపాడులో ప్రారంభం కానున్న కార్యక్రమం
- దాదాపు రూ. 1.50 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్న పవన్ కల్యాణ్
ఈ సందర్భంగా కంకిపాడులో రూ. 91 లక్షలతో నిర్మించే 11 సిమెంట్ రోడ్లు, రూ. 4.15 లక్షలతో నిర్మించే రెండు గోకులాలు, పునాదిపాడులో రూ. 54 లక్షలతో నిర్మించే రెండు రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పాటు, 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. కంకిపాడులోని టీడీపీ కార్యాలయం ఆవరణలో సభను నిర్వహించనున్నారు. ఇంకోవైపు, కంకిపాడులో జరిగే కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తదితరులు పాల్గొననున్నారు.