విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
దసరా నవరాత్రులు ముగిశాయి. పండుగ సెలవులకు సొంతూళ్లకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో, విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాదిగా వాహనాలు రోడ్డెక్కడంతో రహదారి రద్దీగా మారింది. చౌటుప్పల్ నుంచి కొయ్యలగూడెం వరకు వాహనాలు నిదానంగా వెళ్లాల్సి వస్తోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది.