నన్ను గెలిపిస్తే ఈ పనులన్నీ చేసి పెడతా.. మ్యానిఫెస్టో విడుదల చేసిన సర్పంచ్ అభ్యర్థి
- యాదాద్రి జిల్లా మల్కాపూర్‌లో ఓ నాయకురాలు వినూత్న ప్రయోగం
- 14 అంశాలతో కూడిన మ్యానిఫెస్టో
- మల్కాపూర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ
మ్యానిఫెస్టో ఇలా..
1. గ్రామంలో మంచినీటి ఫిల్టర్ ఏర్పాటు
2. కులాలకు అతీతంగా చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల కోసం వైకుంఠ రథం, ఫ్రీజర్
3. ఇంటి పన్ను మాఫీ
4. ఇంట్లో ఎవరైనా చనిపోతే రూ. 20 వేల ఆర్థిక సాయం
5. ఆడపిల్ల జన్మిస్తే రూ. 5 వేలు
6. ఆడపడుచు పెళ్లి కానుక
7. ఒంటరి మహిళకు, వృద్ధులకు నివాస వసతి గృహం
8. ఎస్సీ, బీసీలకు కమ్యూనిటీ హాల్
9. నిరుద్యోగ ఆడపడుచులకు 30 కుట్టు మిషన్లతో టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్
10. స్కూలు పిల్లలకు నోటు పుస్తకాలు
11. ముదిరాజ్‌లు చేపలు పెంచుకునేందుకు చెరువులపై పూర్తి అధికారం
12. గ్రామ దేవత గుడి నిర్మాణం
13. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం
14. బస్తీ దవాఖానా, గ్రంథాలయం