మహిషాసురమర్ధని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ
- ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం
- ఇంద్రకీలాద్రిపై ముగింపు దశకు చేరుకున్న శరన్నవరాత్రి ఉత్సవాలు
- రేపు కృష్ణానదిలో హంస వాహనంపై దుర్గామల్లేశ్వరుల జల విహారం
మహిషాసుర సంహారం జరిగిన రోజునే మహర్నవమిగా జరుపుకోవడం ఆనవాయతీ. ఈ రోజున చండీ సప్తశతీ హోమం చేసిన వారికి శత్రుభయం ఉండదని, అన్నింటా విజయం కలుగుతుందని పండితులు చెబుతుంటారు. ఉత్సవాలు రేపటితో ముగుస్తుండటంతో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం సాయంత్రం కృష్ణానదిలో హంస వాహనంపై దుర్గామల్లేశ్వరులను జల విహారం చేయించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.