హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా?
- అక్టోబర్ 7 దాడుల సూత్రధారి యహ్యా సిన్వర్
- ఈ ఏడాది ఆగస్టులో హమాస్ చీఫ్గా నియమాకం
- గత నెల 21న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మృతి చెందినట్టు అనుమానం
- ఆయన బతికే ఉన్నారంటూ ఖతర్ దౌత్యవేత్త పోస్టు
అక్టోబర్ 7 దాడుల సూత్రధారి అయిన సిన్వర్ ఈ ఏడాది ఆగస్టులో హమాస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. గత నెల 21న హమాస్ కమాండ్ సెంటర్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో సిన్వర్ మృతి చెంది ఉంటాడని భావించారు. అయితే, ఈ విషయంలో హమాస్ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఇప్పుడు ఖతర్ దౌత్యవేత్త చేసిన పోస్టుతో అతడు బతికే ఉన్నాడని ఇజ్రాయెల్ భావిస్తోంది.