ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి
- అమిత్ షాను కలిసి వరద సాయం పెంచాలని విజ్ఞప్తి
- మూసీ ప్రక్షాళనకు సహకరించాలని విన్నపం
ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. దేశంలో నక్సలిజం రూపుమాపడంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు.