మరికాసేపట్లో చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ
- టీడీపీ అధినేతను కలవనున్న మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు
- చంద్రబాబును తన మనవరాలు శ్రేయరెడ్డి పెళ్లికి ఆహ్వానించనున్న మల్లారెడ్డి
- ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్‌లో చంద్రబాబుతో భేటీ
చంద్రబాబును కలిసి మల్లారెడ్డి మనవరాలు శ్రేయరెడ్డి పెళ్లికి ఆహ్వానించనున్నారు. గతంలో మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి టీడీపీలో పనిచేసిన విషయం తెలిసిందే. కానీ, ఆ తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పారు. మల్లారెడ్డి మనవరాలు పెళ్లి కారణంగా చాలా కాలం తర్వాత మళ్లీ టీడీపీ అధినేతను కలవబోతున్నారు.