షార్ట్ సర్క్యూట్తో భవనంలో మంటలు.. ఏడుగురు కుటుంబ సభ్యుల సజీవ దహనం
- ముంబైలోని చెంబూరులో ఘటన
- కిందనున్న ఎలక్ట్రిక్ షాపులో మంటలు చెలరేగి మొదటి అంతస్తుకు
- మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని రక్షించి ఆసుపత్రికి తరలింపు
- అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యుల నిర్ధారణ
- మృతుల్లో ఏడేళ్ల చిన్నారి కూడా
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుల్లో ఏడేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.