G Jagadish Reddy: కొండా సురేఖపై నిప్పులు చెరిగిన జగదీశ్ రెడ్డి

మంత్రి కొండా సురేఖ మాటలు ఆమె మానసికస్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆమె మాటలు రాజకీయ నాయకులు సైతం సిగ్గుపడేలా ఉన్నాయని విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... స్థాయిలేని వారికి మంత్రి పదవి రావడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. 

కొండా సురేఖ ఫొటోకు సంబంధించి ఎవరో ఆకతాయిలు చేసిన పనికి కేటీఆర్‌కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుకాల ఉండి మంత్రులతో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. దీంతో హైడ్రాను తెరపైకి తీసుకువచ్చిందని, హైడ్రా విఫలం కావడంతో సినిమా తారల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలతో కుటుంబాలు నాశనమయ్యేలా ఉన్నాయన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మానసికస్థితి బాగా లేదని ఎద్దేవా చేశారు. నేటి మూసీ దుస్థితికి కారణం కాంగ్రెస్సే అన్నారు.
G Jagadish Reddy
Telangana
Konda Surekha
Revanth Reddy

More Telugu News