అక్టోబర్ 15, 16న పాకిస్థాన్‌లో కేంద్రమంత్రి జైశంకర్ పర్యటన
- ఇస్లామాబాద్ వేదికగా వార్షిక షాంఘై సహకార సంఘం సమావేశం
- ఎస్సీవో సదస్సుకు ఆతిథ్యమిస్తున్న పాక్
- ఈ సమావేశానికి హాజరుకానున్న జైశంకర్
ఎస్సీవో సదస్సుకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. పాక్ నుంచి ఆహ్వానం అందినట్లు ఆగస్ట్ 30న కేంద్రం ధృవీకరించింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఎస్సీవో సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు ఆయా దేశాల మధ్య ఆర్థిక, సామాజిక-సంస్కృతిక, మానవతా సహకారంపై చర్చించనున్నారు.