ఏదైనా పథకాన్ని ఆపి అయినా ఈ హామీలు నెరవేరుస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు మాట్లాడుతున్నాయని విమర్శ
- అన్ని సబ్సిడీ పథకాలను పునరుద్ధరిస్తామన్న మంత్రి
- రైతుకు ఇబ్బంది కలగవద్దని రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారన్న మంత్రి
రైతులకు కచ్చితంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఏ ఒక్క రైతు అధైర్యపడవద్దన్నారు. దేశంలో ఎక్కువ పంటలను సాగు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణయే అన్నారు. మన రాష్ట్రంలో ఒక కోటి 45 లక్షల టన్నుల వరి ధాన్యం పండిస్తున్నట్లు చెప్పారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారన్నారు. సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు.