ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డికి తీవ్రగాయాలు

MLA Yashaswini aunt Jhansi Reddy seriously injured after stage collapsed at Torrur
  • షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో వేదిక కూలిన ఘటనలో గాయాలు
  • మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఘటన
  • ఝాన్సీరెడ్డిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డి ఇవాళ మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరులో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆమె ప్రజలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దాంతో, ఝాన్సీరెడ్డిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
Jhansi Reddy
Accident
Congress
Telangana

More Telugu News