కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి: హరీశ్ రావు
- కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేసిన కొండా సురేఖ
- కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన మంత్రి
- మార్గరేట్ థాచర్ కోట్‌ను జతచేసిన హరీశ్ రావు
కొండా సురేఖపై జరిగిన ట్రోలింగ్‌ను ఒక మహిళగా తాము ఖండించామని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కానీ బాధ్యతగల మంత్రిగా దిగజారి ఆమె మాట్లాడటం సరికాదన్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి అన్నారు. ఒక మహిళగా మరో మహిళను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. తనపై ఎవరో ట్రోల్ చేస్తే కేటీఆర్‌కు ఆపాదించడం, వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను కామెంట్ చేసిన విషయం కొండా సురేఖ మరిచారా? అని ప్రశ్నించారు.