మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు
- టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్
- దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని కోరిన పోలీసుల తరపు న్యాయవాదులు
- ఈ నెల 4వ తేదీన బెయిల్ పిటిషన్ పై తీర్పు వెల్లడిస్తామని పేర్కొన్న హైకోర్టు
సురేశ్‌కు నేరచరిత్ర ఉందని, మేజిస్ట్రేట్ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వారి బెయిల్ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పి వీరారెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారంతో పిటిషనర్లపై కేసు పెట్టారని, ఇప్పటికే పోలీసు కస్టడీలో వారిపై విచారణ ముగిసిందన్నారు. ఇంకా జైలులో ఉండాల్సిన అవసరం లేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో ఈ నెల 4న తీర్పు వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ తెలిపారు.