అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి బయల్దేరిన పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి చేరుకున్నారు. జనసేన శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఆయన రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసి, కాలినడకన మెట్ల మార్గంలో తిరుమల బయల్దేరారు. పవన్ వెంట ఆయన మిత్రుడు , ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు. పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో, అలిపిరి మెట్ల మార్గంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇటీవల తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం తెరపైకి వచ్చిన నేపథ్యంలో, పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆయన రేపు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని, తన ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. ఇక ఎల్లుండి సాయంత్రం తిరుపతిలో పవన్ కల్యాణ్ వారాహి సభను నిర్వహించనున్నారు.