రామ్‌చరణ్‌పై సమంత ప్రశంసలు!
- గేమ్ ఛేంజర్ నుంచి రెండో సాంగ్ విడుదల
- చరణ్ డ్యాన్స్‌కు సమంతా ఫిదా
- డిసెంబరులో సినిమా విడుదల
రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 20న కిస్మస్ కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా స్థాయిలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా వుండగా 'రా మచ్చా మచ్చా' పాటలో చరణ్ డ్యాన్స్ మూమెంట్స్‌కు కథానాయిక సమంత ఫిదా అయిపోయింది. నీకెవరూ సాటిరారు.. అంటూ అన్‌మ్యాచ్‌బుల్ అని మెన్షన్ చేస్తూ... ఫార్మల్ ప్యాంట్ , షర్డ్‌తో ఇలా ఎవరైనా డ్యాన్స్ చేయగలరా అంటూ తన సోషల్‌మీడియా ఖాతాలో రాసుకొచ్చింది.
గతంలో రామ్‌చరణ్, సమంత 'రంగస్థలం' అనే బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. సమంతతో పాటు రామ్‌చరణ్ అర్ధాంగి ఉపాసన కూడా మిస్టర్ సీ మీ డ్యాన్స్‌తో హై ఓల్టెజ్ పుట్టించారని రామ్‌చరణ్ చేసిన పోస్ట్‌కు స్పందించారు.