Goat: ఓటీటీలోకి 'గోట్' మూవీ.. ఎప్పుడు, ఎక్క‌డ స్ట్రీమింగంటే..!

Goat Ott Release When And Where To Watch
షార్ట్స్‌లో చూడండి
దళపతి విజయ్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వెంకట్‌ప్రభు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ తాజా చిత్రం ‘గోట్‌' (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌). సెప్టెంబ‌ర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ సినిమా ప్రేక్ష‌క‌లను బాగానే అల‌రించింది. అయితే, తెలుగులో మాత్రం గోట్‌కు అంత‌గా ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఈ మూవీ ఆక‌ట్టుకోలేక‌పోయింది.  

తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేందుకు రెడీ అయింది. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో 'గోట్‌' ప్రసారం కానుంది. నెట్‌ఫ్లిక్స్ తాజాగా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించింది. తమిళంతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి అందుబాటులో ఉంటుంద‌ని తెలిపింది.

ఇక ఈ సినిమాలో విజ‌య్‌తో పాటు ప్రశాంత్‌, వైభ‌వ్‌, ప్రభుదేవా, లైలా, జయరాం, యోగిబాబు, కిచ్చా సుదీప్ ఇత‌ర కీలక పాత్రల్లో క‌నిపించారు. విజయ్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీలో ఆయ‌న‌కు జోడిగా మీనాక్షి చౌదరి, స్నేహ న‌టించారు. యువ‌న్ శంక‌ర్ రాజా బాణీలు అందించారు.
Go Back to Shorts
Goat
OTT
Netflix
Thalapathy Vijay
Kollywood
Tollywood

More Telugu News