దసరా సీజన్ వచ్చేస్తోంది.... స్పెషల్ బస్సుల వివరాలు ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ
- దసరా సందర్భంగా అక్టోబర్ 4 నుండి 20వ తేదీ వరకూ 6,100 ప్రత్యేక బస్సులు
- ప్రత్యేక సర్వీసుల్లోనూ సాధారణ చార్జీలనే వసూలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్న ఆర్టీసీ
అక్టోబర్ 4 నుంచి 11 వరకూ దసరా ముందు 3,040 ప్రత్యేక బస్సులు, అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకూ దసరా తర్వాత మరో 3,060 బస్సులు నడపనున్నట్లు తెలిపింది. అయితే, ప్రయాణికులపై ఎలాంటి భారం పడకుండా ఈ ప్రత్యేక సర్వీసుల్లోనూ సాధారణ చార్జీలనే వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. అంతే కాకుండా ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో పాటు రానుపోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో పది శాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మధ్య నడిచే ఏసీ బస్సుల్లోనూ టికెట్ చార్జీలపై పది శాతం రాయితీ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలియజేసింది.