భారతీయులకు రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు మంజూరు చేసిన అమెరికా
- 2023లో భారతీయులకు 1.4 లక్షల విద్యార్థి వీసాలు మంజూరు
- తాజాగా అందుబాటులోకి 2.5 లక్షల వీసా అపాయింట్ మెంట్లు
- భారతీయ విద్యార్థులకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్న అమెరికా
దీనిపై భారత్ లో అమెరికా దౌత్య కార్యాలయ వర్గాలు స్పందిస్తూ, ఈ వేసవిలో రికార్డు స్థాయిలో వీసా దరఖాస్తులను పరిశీలించామని, దరఖాస్తుదారులందరూ తొలిసారిగా అమెరికా వెళుతున్నవారేనని వెల్లడించాయి.
కాగా, భారతీయ విద్యార్థుల నుంచి అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో, అమెరికా కొత్తగా 2.5 లక్షల వీసా అపాయింట్ మెంట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అపాయింట్ మెంట్ స్లాట్లను విడుదల చేయడం వల్ల... భారతీయ దరఖాస్తుదారులు తగిన వ్యవధిలో ఇంటర్వ్యూలు పూర్తి చేసేందుకు వీలు కలుగుతుందని అమెరికా ఎంబసీ వివరించింది.