కాన్పూర్ టెస్ట్: వాన దెబ్బకు మూడో రోజు ఆట కూడా రద్దు
- కాన్పూర్ లో టీమిండియా × బంగ్లాదేశ్ రెండో టెస్టు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
- 3 వికెట్లకు 107 పరుగులు చేసిన బంగ్లాదేశ్
- తొలి రోజే వర్షం కారణంగా నిలిచిన ఆట
- ఇప్పటిదాకా ఆట మళ్లీ మొదలు కాని వైనం
ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 107 పరుగులతో ఆడుతున్నప్పుడు నిలిచిపోయిన ఆట... మళ్లీ మొదలుకాలేదు. ఇవాళ మధ్యాహ్నం కూడా మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు... ఆట కొనసాగించడం సాధ్యం కాదని తేల్చేశారు.