లులూ మళ్లీ వస్తోంది: ఏపీ సీఎం చంద్రబాబు
- ఇవాళ అమరావతి విచ్చేసిన లులూ అధినేత యూసుఫ్ అలీ
- సీఎం చంద్రబాబుతో సమావేశం
- పలు ప్రతిపాదనలపై చర్చ
వైజాగ్ లో ఓ భారీ షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్... విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించడంపై చర్చించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడంపైనా ఈ సమావేశంలో ప్రస్తావన వచ్చిందని చంద్రబాబు వివరించారు.
లులూ సంస్థకు ఏపీ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మిత్రుడు యూసుఫ్ అలీ భవిష్యత్ లో స్థాపించబోయే ప్రాజెక్టులు అన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు సోషల్ మీడియాలో వెల్లడించారు.