భార్య బికినీ ధరించేందుకు ఏకంగా ఓ దీవినే కొనేసిన భర్త
- భారీ పెట్టుబడితో ద్వీపాన్ని కొన్న భర్త
- సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన దుబాయ్ మహిళ సౌదీ అల్ నదక్
- వైరల్‌గా మారిన వీడియో
కాగా దంపతులు ఇద్దరూ ఛార్టెడ్ ఫ్లైట్‌లో ప్రయాణించి ఐలాండ్‌కు చేరుకున్నట్టు వీడియోలో కనిపించింది. అందమైన బీచ్, ఆహ్లాదకరమైన వాతావరణ, రాళ్లు, కొబ్బరి చెట్లు, చుట్టూ పచ్చని వాతావరణం ఈ వీడియోలో ఆకట్టుకునేలా ఉన్నాయి.
తాను ఏకాంతంగా బికినీ ధరించేందుకు ఐలాండ్‌ను కొనుగోలు చేసినట్టు ఆమె తెలిపింది. 2.5 మిలియన్లకు పైగా వ్యూస్ లభించిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాలామంది విమర్శలు గుప్పించారు. డబ్బును వృథా చేయడమేనని పలువురు పేర్కొన్నారు. ఆమె విలాసవంతమైన జీవనశైలిని చాటిచెప్పుకోవడానికి ఇదొక మార్గమని కొందరు అన్నారు.
పేదలకు డబ్బు విరాళంగా ఇవ్వండంటూ ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. అలాంటి మహిళతో మీరు బిలియనీర్ కాలేరని మరో వ్యక్తి సరదా వ్యాఖ్యలు చేశాడు. ‘‘డబ్బు ఆదా చేయడం మంచిది. పెట్టుబడిగా పెట్టండి’’ అని మరో వ్యక్తి పేర్కొన్నాడు. కాగా 26 ఏళ్ల సౌదీ అల్ నదక్ సోషల్ మీడియా వేదికగా తరచూ తన విలాసవంతమైన జీవితాన్ని షేర్ చేస్తుంటారు. ఆమె భర్త పేరు జమాల్ అల్ నదక్. ఆయన మిలియనీర్. వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు.