అక్టోబర్ మొదటి వారంలో విజయవాడలో 'ఇన్సూరెన్స్ లోక్ అదాలత్'
- అక్టోబర్ 1 నుండి 7వరకు విజయవాడలో ఇన్సూరెన్సు లోక్ అదాలత్
- బుడమేరు వరదల్లో దెబ్బతిన్న మోటారు వాహనాల బీమా క్లైమ్‌ల పరిష్కారానికి వేదిక
- బాధితులకు సాధ్యమైనంత మేర మేలు జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయం సమీపంలో గల రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బీమా కంపెనీలు, ఆటోమొబైల్ బాడీ షాప్స్ మరియు ఆటో డ్రైవర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో మోటారు వాహనాల బీమా క్లైమ్ల సత్వర పరిష్కార అంశంలో ఎదురవుతున్న పలు సమస్యలు, వాటి పరిష్కారానికై తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు కార్య నిర్వాహక అధ్యక్షులు, న్యాయమూర్తి జస్టిస్ జి.నరేందర్ ఆదేశాల మేరకు ఈ ఇన్సూరెన్సు లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోటారు వాహనాల బీమా క్లైమ్లకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు అన్నింటినీ సానుకూలంగా పరిశీలిస్తూ బాధితులకు సాధ్యమైనంత మేర మేలు జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని బీమా కంపెనీల ప్రతినిధులను ఆమె కోరారు.