అమరావతిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్ సెంటర్
- కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- 20 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ
- కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేయాలన్న జగన్ ప్రభుత్వం
- ప్రభుత్వం మారడంతో రాజధాని ప్రాంతంలో ఏర్పాటుకు రెడీ
నిజానికి తొలుత దీనిని కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఏర్పాటు చేయాలని అప్పటి జగన్ ప్రభుత్వం కోరింది. అయితే, ప్రభుత్వం మారడంతో ఇప్పుడు దీనిని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపింది. దీనికి కేంద్రం ఓకే చెప్పింది. ఈ టెక్నాలజీ సెంటర్ ద్వారా యువతకు ప్రపంచస్థాయి స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్‌తోపాటు వివిధ ఇంజినీరింగ్ టెక్నాలజీ కోర్సుల్లో డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాములు అందిస్తారు.