విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన
- రేపు, ఎల్లుండి విశాఖలో పర్యటించనన్ను మంత్రి లోకేశ్
- రేపు ఉదయం 10 గంటలకు సీఐఐ సదస్సుకు హాజరు
- ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం
- పార్టీ శ్రేణులతో కీలక భేటీ
సీఎం చంద్రబాబును కలవనున్న కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు
కూటమి ప్రభుత్వం ఇవాళ 99 మందితో నామినేటెడ్ పోస్టుల తొలి జాబితా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన వారు రేపు సీఎం చంద్రబాబును కలవనున్నారు. నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ల చైర్మన్లు రేపు ఉండవల్లిలోని సీఎం నివాసానికి రావాలని పిలుపు అందింది. ఈ సమావేశంలో కార్పొరేషన్ల చైర్మన్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.