'మా ఎమ్మెల్యే కేటీఆర్ కనిపించడంలే'దని పోలీసులకు ఫిర్యాదు
- సిరిసిల్ల నియోజకవర్గంలో పలు గ్రామాలు సమస్యలకు నిలయంగా మారాయన్న బీజేపీ నేత
- ప్రజలు అవస్థలు పడుతుంటే ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని విమర్శ
- నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని మండిపడుతున్న ప్రతిపక్ష నేతలు
గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు. కేటీఆర్ కు రాజకీయంగా జన్మనిచ్చిందే సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలని గుర్తుచేసిన బీజేపీ నేత.. ఇప్పుడు ఆ నియోజకవర్గాన్నే కేటీఆర్ గాలికి వదిలేశాడని ఆరోపించారు. గంభీరావుపేట మండలం పరిధిలోని లింగన్నపేట వాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మిస్తామంటూ గతంలో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఆర్భాటం చేశారని చెబుతూ.. సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకూ బ్రిడ్జి మాత్రం పూర్తిచేయలేదన్నారు. ఈ క్రమంలోనే తమ ఎమ్మెల్యే నిత్యం తమకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.