తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు.. హైదారాబాద్ లో భారీ చోరీ
- ఐటీ కారిడార్ లోని ఓ ఇంట్లో చొరబడి నోట్ల కట్టలు ఎత్తుకెళ్లిన దొంగలు
- భూమి అమ్మగా వచ్చిన సొమ్మును ఇంట్లో దాచిన రియల్టర్
- నగదుతో పాటు 28 తులాల బంగారం గాయబ్
ఇందులో భాగంగా రూ.2 కోట్ల 2 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నాడు. ఈ సొమ్మును నాగభూషణం ఇంట్లోనే దాచాడు. ఈ విషయం ఎలా తెలిసిందో ఏమో కానీ శనివారం రాత్రి దొంగలు పడి ఆ సొమ్మంతా ఎత్తుకెళ్లారు. ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగలగొట్టి డబ్బు, నగలు పట్టుకెళ్లారని బాధితుడు నాగభూషణం కన్నీటిపర్యంతమయ్యాడు. నాగభూషణం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగతనం జరిగిన తీరును పరిశీలించి, పరారైన దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానంతో నాగభూషణం డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.