దుర్గాపూజ నేపథ్యంలో ఫుల్ డిమాండ్.. హిల్సా చేపల ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన బంగ్లాదేశ్
- ఈ నెల మొదట్లో హిల్సా చేపలపై బంగ్లాదేశ్ నిషేధం
- భారత్‌కు 3 వేల టన్నుల హిల్సా చేపల ఎగుమతికి గ్రీన్ సిగ్నల్
- రానున్న దుర్గాపూజల నేపథ్యంలో హిల్సా చేపలకు ఇరు దేశాల్లోనూ భారీ డిమాండ్
బంగ్లాదేశ్‌తోపాటు ఇండియాలోనూ హిల్సా చేపలు ప్రసిద్ధికెక్కాయి. దుర్గాపూజ సమయంలో ఇది మరింత రుచికరమైన వంటగా పరిగణిస్తారు. ఇరు దేశాల్లోనూ లక్షలాది మంది దుర్గాపూజ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో హిల్సా చేపలకు భారీ డిమాండ్ ఉంటుంది. ప్రపంచంలోని హిల్సా చేపల ఉత్పత్తిలో 70 శాతం ఒక్క బంగ్లాదేశ్ నుంచే ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు, హిల్సా బంగ్లాదేశ్ జాతీయ చేప.