Balakrishna: అక్కినేని నాగేశ్వరరావు గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం: బాలకృష్ణ

Balakrishna tributes to Akkineni Nageswara Rao
షార్ట్స్‌లో చూడండి
సినీ కళామతల్లి ముద్దుబిడ్డ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఈరోజు తలుచుకోవడం మనకు గర్వకారణమని తెలిపారు. ఆయన పోషించిన పాత్రలు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 

ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతి నటుడికి మార్గదర్శకమని వివరించారు. సినీ రంగానికి అపారమైన సేవలు అందించిన నాగేశ్వరావు గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదామని పిలుపునిచ్చారు. నాటకరంగం నుంచి చిత్రరంగం వరకు ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని... ఈరోజు ఆయనకు నివాళి అర్పిస్తూ, ఆయన సాధించిన విజయాలను స్మరించుకుందామని పేర్కొన్నారు.
Go Back to Shorts
Balakrishna
Akkineni Nageswar Rao
Tollywood

More Telugu News