ఆ ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది: సీఎం చంద్రబాబు
"ఆ ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకు ఆశ్చర్యం వేసేది... రోడ్డు పక్కన పరదాలు కట్టేసేవారు. అతడు ఆకాశంలో వచ్చేవాడు... హెలికాప్టర్ లో వస్తుంటే కింద ఉన్న చెట్లన్నీ కొట్టేసేవారు. అంతేగాకుండా, ఒక కర్ఫ్యూ తరహా వాతావరణం కనిపించేంది. ఇష్టమున్నా, లేకపోయినా డ్వాక్రా సంఘాల వారిని బలవంతంగా తీసుకొచ్చేవారు. రాకపోతే పెన్షన్ కట్, రేషన్ కట్!
ఆయన సభకు వచ్చినవాళ్లు వెంటనే వెళ్లిపోకుండా చుట్టూరా కందకాలు తవ్వేసేవాళ్లు. ఇలాంటివన్నీ నేను టీవీలో చూసేవాడ్ని. అందుకే, ప్రజలందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలన్న సంకల్పంతో, చరిత్రలో ఎన్నడూ చూడనంత విజయాన్ని సాధించి పెట్టారు" అని వివరించారు.