సినిమా స్టయిల్లో చోరీ... వీడియో వైరల్!

thieves crash through ceiling during us robbery
  • అట్లాంటాలోని ఓ దుకాణంలోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు
  • మహిళా ఉద్యోగిని బెదిరించి నగదుతో ఉడాయించిన వైనం
  • సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
అమెరికాలోని అట్లాంటాలో సినీ పక్కీలో జరిగిన ఓ చోరీ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ దుకాణంలో చోరీకి వచ్చిన ఇద్దరు దుండగులు ముందుగా షాపు సీలింగ్ లోకి చేరుకున్నారు. దుకాణంలో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి నడుచుకుంటూ వస్తున్న సమయంలో సీలింగ్ బద్దలు కొట్టుకుని ఆ దుండగులు కిందకు దూకారు. ఈ హఠాత్పరిణామంతో ఆ మహిళా ఉద్యోగి భయాందోళనలకు గురయింది. ఒక దుండగుడు ఆమెను బెదిరిస్తుండగా, మరో దుండగుడు కూడా సీలింగ్ నుండి కిందకు దూకాడు. 

వీరు ఇద్దరూ కలిసి ఆమెను ఓ గదిలోకి తీసుకువెళ్లి.. అక్కడ ఉన్న సేఫ్‌ను తెరిపించి.. అందులోని సొమ్మును తమ బ్యాగ్ లోకి సర్దుకున్నారు. ఆ తర్వాత ఆమెను అక్కడే టేపులతో బంధించి దుండగులు తాపీగా డోర్ తీసుకుని బయటకు వెళ్లిపోయారు. అట్లాంటా చెక్ క్యాషియర్స్‌లో జరిగిన ఈ దోపిడీలో మొత్తం 1,50,500 డాలర్లు అపహరణకు గురయినట్లు తెలుస్తోంది. దుండగులను నల్ల జాతీయులుగా అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Go Back to Shorts
America
robbery
Atlanta

More Telugu News