RC16 UPDATE: రామ్‌చరణ్‌ సినిమాతో నా కోరిక తీరబోతుంది: డ్రెస్‌ డిజైనర్‌ ఏకాంబరమేగన్‌

My wish will be fulfilled with Ram Charans movie
షార్ట్స్‌లో చూడండి
ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత కథానాయకుడు రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రం 'గేమ్‌చేంజర్‌'. ప్రముఖ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో ఇది రూపొందుతోంది. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక 'గేమ్ చేంజర్‌' తరువాత రామ్‌చరణ్‌ 'ఉప్పెన' ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఆర్‌సీ 16 అనే వర్కింగ్‌ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో జాహ్నవి కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అండ్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట్‌ సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది. 

ఇక, ఈ చిత్రం గురించి వస్తున్న అప్‌డేట్స్ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఓ స్పోర్ట్స్‌ పర్సన్‌గా కనిపించబోతున్నారని తెలిసింది. ఏఆర్‌రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రంలో కనిపించబోయే మేకోవర్‌ కోసం రామ్‌చరణ్‌ ప్రత్యేక శిక్షణలో వున్న ఫోటో ఒకటి బయటికొచ్చిన సంగతి తెలిసిందే. బీస్ట్‌ మోడ్‌ ఆన్‌ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఆ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి మరో టాలెంటెడ్‌ టెక్నిషియన్‌ యాడ్‌ అయ్యారు.  తమిళంలో ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా రాణిస్తున్న ఏకాంబర మేగన్‌ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 

ఈ విషయాన్ని ఆయన తన సోషల్‌మీడియా అకౌంట్‌ ద్వారా తెలియజేశాడు. ''టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా వుంది. ఇలాంటి క్షణం కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నాను. ఎట్టకేలకు నా కోరిక తీరబోతుంది. నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశం కల్పించిన బుచ్చిబాబు సానకు నా ధన్యవాదాలు. రామ్‌చరణ్‌ గారితో కలిసి వర్క్‌ చేస్తున్నాననే ఫీలింగ్‌ నాలో ఉత్సుకతను కలిగిస్తోంది. కోలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు ఈ సినిమాతో జరిగే ఈ నా ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు వెలికితీసే అవకాశం, తెలుగు నేటివిటిని గురించి మరింత తెలుసుకునే చాన్స్‌ రావడం ఆనందంగా వుంది. ఆర్‌సీ 16 ప్రాజెక్ట్‌కు పనిచేయడం సంతోషంగా వుంది' అంటూ ఏకాంబరమేగన్‌ తన ఇన్‌స్టా అకౌంట్‌లో రాసుకొచ్చారు. దీంతో పాటు బుచ్చిబాబు సానతో దిగిన ఓ ఫోటోను ఆయన షేర్‌ చేశారు.
Go Back to Shorts
RC16 UPDATE
Ramcharan
Ramcharan latest news
Buchi babu sana
Ekambaramaegan

More Telugu News