నవంబర్ చివరలో లేదా డిసెంబర్ ప్రారంభంలో ఐపీఎల్ మెగా వేలం!

  • రెండు రోజుల్లో నిబంధనలు వెల్లడయ్యే అవకాశం
  • ఈ మేరకు వెల్లడించిన బీసీసీఐ సన్నిహిత వర్గాలు
  • రెండు రోజుల పాటు నిర్వహించనున్న మెగా వేలం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం మెగా వేలం ఈ ఏడాది నవంబర్ చివరలో లేదా డిసెంబర్ ప్రారంభంలో జరగనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన నియమనిబంధనలను బీసీసీఐ రెండు రోజుల్లో విడుదల చేయనుందని తెలిపారు.

గత పదేళ్లలో రెండు పర్యాయాలు ఐపీఎల్ అతిపెద్ద వేలంపాటలను నిర్వహించింది. మొదట 2014లో, ఆ తర్వాత 2018లో నిర్వహించింది. అప్పుడు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ సస్పెన్షన్ తర్వాత తిరిగి ఐపీఎల్‌లోకి వచ్చాయి. 

2025 ఐపీఎల్‌కు సంబంధించి మెగా వేలానికి సంబంధించి మరో రెండు రోజుల్లో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి. కరోనా కారణంగా 2021 మెగా వేలం వాయిదా పడింది. త్వరలో జరగనున్న మెగా వేలం రెండు రోజుల పాటు నిర్వహిస్తారు.

IPL 2024
IPL
Cricket

More Telugu News