చంద్రబాబు చిత్రపటానికి పుష్పాభిషేకం చేసిన బుద్దా వెంకన్న
- బుద్దా కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి పూవులతో అభిషేకం
- కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు, వరద బాధితులు
- విపత్తు సమయంలో చంద్రబాబు చేపట్టిన చర్యలు ఆదర్శనీయమన్న బుద్దా
ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలతో పాటు వరద బాధితులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు 'మా బాబు బంగారం' అంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబుపై బుద్దా వెంకన్న తన స్వామి భక్తిని చాటుకున్నారు. తన రక్తంతో చంద్రబాబు చిత్రపటానికి అభిషేకం చేశారు. ఈ ఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.