ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్
- లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామాను సమర్పించిన కేజ్రీవాల్
- నూతన శాసన సభా పక్ష నేతగా అతిశీ ఎంపికైనట్లు వెల్లడి
- మరో వారం రోజుల్లో సీఎంగా ప్రమాణం చేయనున్న అతిశీ
ఢిల్లీ ప్రయోజనాల దృష్ట్యా జైల్లో ఉన్నప్పుడు రాజీనామా చేయవద్దని కేజ్రీవాల్ భావించారని, అందుకే ఆయన బయటకు వచ్చాక రాజీనామా చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. జైలు నుంచి బయటకు వచ్చాక ఢిల్లీ ప్రజల ముందు తన నిజాయతీని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. కేజ్రీవాల్ ప్రజాకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారన్నారు. ప్రజలు అతనిని మరోసారి సీఎంగా ఎన్నుకునే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగబోరన్నారు.