అమెరికాలో పైప్ లైన్ పగిలి ఎగసిపడుతున్న మంటలు.. వీడియో ఇదిగో!
--
మంటలు విస్తరించి పలు విద్యుత్ స్తంభాలు కాలిపోయాయని, చుట్టుపక్కల పలు నివాసాలకు మంటలు అంటుకున్నాయని అధికారులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లతో నీళ్లు చల్లుతున్నారు. హెలికాఫ్టర్ తో మంటల తీవ్రతను పరిశీలిస్తూ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. కాగా, ఆకాశంలోకి ఎగసిపడుతున్న మంటలు చాలా దూరం వరకూ కనిపిస్తున్నాయని లా పోర్టే వాసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.