రీల్స్ చేస్తూ లోయలో పడిన మహిళ.. వీడియో ఇదిగో!

Woman Fall Into Valley While Filming Reel
రీల్స్ పిచ్చి జనాన్ని కుదురుగా ఒక చోట ఉండనివ్వడం లేదు. సోషల్ మీడియాలో లైకుల కోసం పాకులాడుతున్న ఎంతోమంది యువతీయువకులు రీల్స్ మోజులో రిస్కీ ఫీట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వార్తలు రోజూ వెలుగు చూస్తున్నా.. తమకేం కాదన్న ధీమాతో కొందరు ఆ పిచ్చి నుంచి బయటపడలేకపోతున్నారు. 

తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో ఓ యువతి రీల్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఓ లోయలో రాయిపైకి ఎక్కి నిల్చున్న యువతి.. కెమెరామన్ స్టార్ట్ అనగానే రొమాంటిక్ సాంగ్ ‘బేపనా ప్యార్ హై, తేరా ఇంతెజార్ హై’ పాటకు డ్యాన్స్ చేస్తూ చేతులూపింది. అనంతరం తిరిగి వస్తుండగా కాలు జారి కిందికి దొర్లుకుంటూ పోయింది. ఈ మొత్తం ఘటన కెమెరాలో రికార్డయింది. ఆ వీడియో అంతవరకు ఉంది. వీడియోను బట్టి ఆమెకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Reels
Viral Video
Himachal Pradesh

More Telugu News