బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర
- 30 లక్షలకు దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి
- గతేడాది 27 లక్షలకు పాడిన దాసరి దయానంద్ రెడ్డి
- మరికాసేపట్లో బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర
తొలి వేలంలో రూ.450లకే..
బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట 1994 నుంచి జరుగుతోంది. వారం పాటు స్వామివారితో పాటు పూజలందుకున్న లడ్డూను చివరి రోజు వేలం వేయడం ప్రారంభమైంది. బాలాపూర్ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తొలి ఏడాది జరిగిన వేలం పాటలో బాలాపూర్ లడ్డూను రూ.450లకు ఓ భక్తుడు దక్కించుకున్నాడు. ఏటేటా లడ్డూ వేలం పాటలో పాల్గొనే భక్తుల సంఖ్య పెరగడం, దాంతోపాటే లడ్డూకు భారీ ధర పలకడం జరుగుతూ వస్తోంది. 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు చేశారు.