వైన్ షాప్ ల వద్ద పర్మిట్ రూమ్ లపై సీఎంతో మాట్లాడతా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- పర్మిట్ రూమ్ లను సాయంత్రం 6 గంటలకు తెరవాలన్న రాజగోపాల్ రెడ్డి
- మునుగోడు నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని వ్యాఖ్య
- మద్యానికి బానిసగా మారితే కుటుంబాలు నాశనమవుతాయన్న ఎమ్మెల్యే
స్థానిక మద్యం దుకాణాల నిర్వాహకులే నాలుగైదు గ్రామాల మధ్య ఒక సబ్ దుకాణం ఏర్పాటు చేసి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయిస్తే బాగుంటుందని కోమటిరెడ్డి అన్నారు. దీనివల్ల ఆదాయం పెరగడమే కాకుండా... గొలుసు దుకాణాల నిర్మూలనకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.