Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంపర్ ఆఫర్లతో వస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్

amazon great indian festival 2024 sale announced
Advertisement
  • సెప్టెంబర్ 27న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 
  • ప్రైమ్ మెంబర్లకు సెప్టెంబర్ 26 నుంచే సేల్
  • ఎస్‌బీఐ కార్డుదారులకు పది శాతం డిస్కౌంట్
Advertisement
ప్రముఖ ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా పండుగ వేళ గ్రేట్ ఇండియన్ సేల్ కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను సెప్టెంబర్ 27న నిర్వహించనుంది. అయితే ప్రైమ్ మెంబర్లకు మాత్రం 24 గంటల ముందే సేల్ అందుబాటులోకి రానుంది. అంటే ప్రైమ్ మెంబర్లకు సెప్టెంబర్ 26 నుంచే సేల్ మొదలు కానుంది. ఈసారి సేల్ లో ఎస్‌బీఐ కార్డు యూజర్లకు పది శాతం డిస్కౌంట్ లభించనుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై పది శాతం రాయితీ పొందవచ్చు. అలానే అమెజాన్ పే యూపీఐతో చేసే రూ.1000పైన కొనుగోళ్లపై రూ.100 డిస్కౌంట్ అందించనున్నట్లు వెల్లడించింది.

సేల్ లో భాగంగా మొబైల్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం, గృహోపకరణాలపై 50 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50 నుండి 80 శాతం, అమెజాన్ అలెక్సా ఉత్పత్తులపై 55 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. మరో గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఈ గ్రేట్ ఇండియన్ సేల్ లో భాగంగా రూ.5,999 నుంచే మొబైల్స్ విక్రయించనున్నట్లు అమెజాన్ తెలిపింది. మొబైల్ యాక్సెసరీస్ రూ.89 నుంచే ప్రారంభమవుతాయని చెప్పింది. 24 నెలల నో – కాస్ట్ ఈఎంఇ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. స్మార్ట్ టీవీల ధరలు రూ.6,999, అమెజాన్ అలెక్సా, ఫైర్ టీవి స్టిక్ డివైజ్ లు రూ.1,999ల నుంచి లభిస్తాయని వెల్లడించింది. సేల్ సమయంలో ట్రావెల్ బుకింగ్‌లపైనా రాయితీ పొందవచ్చని అమెజాన్ పేర్కొంది.
Advertisement
Advertisement
amazon
amazon great indian festival 2024
Business News

More Telugu News