నేడు గుజరాత్ లో చంద్రబాబు పర్యటన ..ఎందుకంటే ..!

ap cm chandrababu to visits gujarat today
  • గుజరాత్‌కు బయలుదేరి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
  • గాంధీనగర్‌లో నేటి నుండి రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ – 2024
  • ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పారిశ్రామిక ప్రతినిధులకు వివరించనున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు వెళ్లారు. గుజరాత్‌లోని గాంధీ నగర్ లో ఆయన పర్యటించనున్నారు. గాంధీ నగర్‌లో నేటి నుండి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ – 2024 లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లారు. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఈ సదస్సులో చంద్రబాబు వివరించనున్నారు. 

అలానే ఎనర్జీ రంగంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల ప్రతినిధులతో భేటీ అయి వారితో చర్చలు జరపనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నందున ఈ సందర్భంలో ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తుంది. అనంతరం రాత్రి 9 గంటలకు చంద్రబాబు అమరావతికి తిరిగి ప్రయాణం కానున్నారు.
Go Back to Shorts
Chandrababu
Gujarat
Chandrababu Gujarat tour
pm modi

More Telugu News