జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కమాండర్‌ను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
- ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో తెగబడుతున్న ఉగ్రవాదులు
- ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చిన భద్రతా బలగాలు
- ఇద్దరు జవాన్ల వీర మరణం
గత రాత్రి ఈ ప్రాంతంలో వీరు నక్కినట్టు సమాచారం అందుకున్న ఆర్మీ గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మెందహార్‌లోని పథనాతీర్ వద్ద భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కాగా, గత 42 ఏళ్లలో భారత ప్రధాని జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లడం ఇదే తొలిసారి.