ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి నేడే చివరి రోజు.. బారులు తీరిన భక్తులు
- ఎల్లుండి శోభాయాత్ర, నిమజ్జనం
- నిమజ్జనానికి మొదలైన ఏర్పాట్లు
- సాయంత్రం రుద్రాక్షల పంపిణీ
భక్తులు పోటెత్తడంతో ఖైరతాబాద్ లో రద్దీ నెలకొంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, టెలిఫోన్ భవన్ వైపు రద్దీ ఎక్కువగా ఉంది. దర్శనానికి చివరిరోజు కావడంతో భక్తుల రద్దీకి అనుగుణంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు సాయంత్రం బడా గణపతి మెడలో వేసిన లక్ష రుద్రాక్షలను పంచి పెట్టనున్నారు. సెప్టెంబర్ 17న మహాశోభాయాత్ర తర్వాత.. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం జరగనుంది.