చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఎనిమిది మంది దుర్మరణం

  • రెండు లారీలను ఢీకొన్న బస్సు
  • మొగిలి ఘాట్ వద్ద ప్రమాదం
  • బస్సు తిరుపతి నుంచి బెంగళూరుకు వెళుతుండగా యాక్సిడెంట్
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలను బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

బస్సు తిరుపతి నుంచి బెంగళూరుకు వెళుతుండగా మొగిలి ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

రోడ్డు ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Chittoor District
Road Accident

More Telugu News